బ్రేకింగ్ : ఆగష్టు 16 నుండి పాఠశాలలు పున:ప్రారంభం..!

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాఠశాలలు పున:ప్రారంభ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 16 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను పున: ప్రారంభించాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఆగష్టు 16 ననే మొదటి విడత ‘నాడు-నేడు’ పనులను ప్రజలకు అంకితమిచ్చి.. రెండో విడత పనులను కూడా మొదలు పెట్టాలని అధికారులకు తెలియ చేశారు.

ఈ క్రమంలో నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరించడమే కాకుండా.. విద్యార్ధులకు విద్యాకానుక కిట్‌లను కూడా ఆగష్టు 16 ననే పంపిణీ చేయాలని సీఎం జగన్ విద్యా శాఖ అధికారులకు తెలియచేసారు. ఇక మరో వైపు సీఎం జగన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం పై తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారు అన్న విషయంపై తీవ్ర చర్చ కొనసాగుతుంది. అంతే కాకుండా కరోనా థర్డ్ వేవ్ ఆగస్ట్ లోనే ఉంటుందని డబ్ల్యూహెచ్వో, వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఇక చివరికి ఏమి అవుతుందో వేచి ఉండాల్సిందే.