కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..?

కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభ‌వార్త తెలిపింది. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ పెంచుతున్న‌ట్లు నిర్ణయం తీసుకుంది. నెలవారీ గరిష్ట పరిమితిని పెంచిన‌ట్టు తెలిపింది. ప్రస్తుతం రూ.45వేలుగా ఉంది. దానిని రూ. 1,25,000కు పెంచింది. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉంటే. ఒకవేళ వారిద్ద‌రు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు వారిద్దరి పెన్షన్ పొందవచ్చు. అంతేగాకుండా 50శాతం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఇక నుంచి కేంద్ర ఉద్యోగుల పెన్షన్‌ను నెలకు గరిష్టంగా రూ.1.25 లక్షలు అందిస్తామని పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ తెలిపింది.

నెలకు కనిష్టంగా రూ.9 వేల వరకు పెన్షన్ తీసుకోవ‌చ్చు. అంతేగాకుండా డీఆర్ అదనంగా జత చేస్తుంది. గతంలో నిబంధనల ప్ర‌కారం ఇద్దరు కుటుంబ సభ్యుల పెన్షన్లు నెలకు రూ. 45 వేలు, 27వేలకు మించకూడదు. ఇప్ప‌డు తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన త‌రువాత కుమారుడికి లేదా కుమార్తెకు నెలకు 2,50,000 పెన్షన్ పొందవచ్చు. డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ ఫేర్ ఈ వివరాలను వెల్ల‌డించింది.

Share post:

Latest