`చిన్నారి పెళ్లి కూతురు` భామ‌ సురేఖ సిక్రీ క‌న్నుమూత‌!

బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియ‌ల్ లో భామ‌గా న‌టించిన సురేఖా సిక్రీ క‌న్నుమూశారు. గుండె పోటుతో శుక్రువారం ఉద‌యం ముంబైలో ఆమె మృతి చెందారు. సురేఖ సిక్రీ వ‌య‌సు 75 సంవత్సరాలు. సురేఖ మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

Surekha Sikri was one of the best things about Balika Vadhu. On Monday  Masala - Television News

దాంతో ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌స్తుతం ఆమె మృతిపై ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. 1978 లో కిస్సా కుర్సీ కా అనే చిత్రంతో తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సురేఖా సిక్రీ.. ఆ త‌ర్వాత అనేక చిత్రాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఈమె మూడుసార్లు జాతీయ ఫిల్మ్ అవార్డుల‌నూ అందుకున్నారు.

Colors TV announces Balika Vadhu's to RE-RUN - Telly Updates

ఇక బాలికా వధు (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ‌..2018లో వచ్చిన బ‌దాయి హో సినిమాలో ఆమె హీరో ఆయుష్మాన్ ఖుర్హాన్‌కు నాన‌మ్మ పాత్ర‌లో న‌టించి బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును అందుకున్నారు.

Share post:

Latest