ఆకాశ వీధుల్లో ట్రైలర్ మీ కోసం…!

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. ఈ సినిమాని జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. కాగా ఈ ఫిల్మ్ కి హీరో, డైరెక్టర్ రెండు గౌతమ్ కృష్ణ నే. ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని నేడు విడుదల చేశారు. కాగా విడుదల చేసిన కొద్దిసేపట్లోనే ఈ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తి గురించి చెప్పే కథ అంటూ చిత్రం బృందం చెప్పుకొచ్చారు.

సినిమాలో గౌతమ్ రాక్ స్టార్ లా కనిపించనున్నాడు. నిర్మాత మనోజ్ మాట్లాడుతూ..దర్శకులు, హీరోయిన్, టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ రామకృష్ణ, చిన్మయి పాడిన పాటలు అదిరిపోతాయి అని అన్నారు. ఈ సినిమా అందరికి నచ్చుతుంది అనే నమ్మకం ఉందని తెలిపారు. హీరో, డైరెక్టర్ గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. సినిమాలు అంటే తనకు విపరీతమైన పిచ్చి అని చెప్పుకొచ్చాడు. హీరోగా.. డైరెక్టర్ చేయడం కష్టమైనా ఎంతో ఇష్టంతో చేశానని.. 160 పేజీల స్క్రిప్ట్ తానొక్కడే రాసుకుని.. తానే దగ్గర ఉండి డైరెక్షన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కసితో చేశాం అని అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

Share post:

Popular