8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వివరాలు ఇలా…!

దేశంలో రోజురోజుకు రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ తన బలం బలగాలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే నేడు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లు నియమితులయ్యారు. 8 రాష్ట్రాలకు చెందిన కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు. ఇంతకీ ఎవరెవరికి గవర్నర్ పదవి ఇచ్చారంటే కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్ కు గవర్నర్ పదవి వరించింది. ఆయన్ను కర్నాటక గవర్నర్ నియమించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమించడం విశేషం.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేశారు. అలాగే మధ్యప్రదేశ్ గవర్నర్ గా మంగుభాయ్ చంగన్ భాయ్ పటేల్ ను నియమించారు. త్రిపుర గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్రన్ విశ్వనాథ్ అర్లేకర్, గోవా గవర్నర్ గా శ్రీధరన్ పిళ్లైను నియమించారు. ఇకపోతే జార్ఖండ్ గవర్నర్ గా రమేష్ బైస్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.