“సర్కారు వారి పాట”లో అర్జున్ రోల్ అదేనట…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రం బ్యాంకు రాబరీల నేపథ్యంలో ఉంటుందని టాక్ . ఈ మూవీ కోసం మహేశ్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియులు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర నిర్మాణం కాస్త నెమ్మదించింది.

ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ రోల్ పై ఆసక్తికర వార్త సర్య్కులేట్ అవుతోంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. త్వరలో థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

Share post:

Latest