రామ్–లింగుస్వామి మూవీ షూటింగ్ షురూ..!

కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న అప్‌కమింగ్ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే నేపథ్యంలోనే కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో మూవీ చిత్రీకరణను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాణ సంస్థ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే, జులై 12వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని ప్రకటించింది.

ఇకపోతే రామ్ కెరీర్‌లో 19వ చిత్రంగా రానున్న ఈ సినిమా యాక్షన్ జానర్ లో రూపొందనుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీలో మాస్ హీరోగా నటించి మెప్పించిన రామ్ తో మరో యాక్షన్ డ్రామా రూపొందించడానికి లింగుస్వామి సిద్ధమయ్యారని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ స్టైలిష్ మాస్ చిత్రంలో రామ్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారని సమాచారం.

Share post:

Latest