ఆగస్ట్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే…!

ఆగష్టు నెలలో మొత్తం 10 బ్యాంకు సెలవులు ఉన్నాయి. సెలవుదినాలను తెలుసుకొని వినియోగదారులు తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవాల్సిందిగా అధికారులు వెల్లడించారు. అయితే చెక్ క్లియరెన్స్, రుణాలు తీసుకునేవారు ఆగస్టు నెల బ్యాంక్ సెలవుదినాలను తెలుసుకొని.. ముందస్తుగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. మరి 31 దినాలు ఉన్న ఆగస్టు నెలలో ఏ రోజున బ్యాంకులకు హాలి డేస్ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

ఆగస్టు 01: ఆదివారం

ఆగస్టు 08: ఆదివారం

ఆగష్టు 13: పాట్రియాట్స్ డే, ఇంఫాల్ జోన్‌లో మాత్రమే బ్యాంక్స్ లకు సెలవు ఉంటుంది.

ఆగష్టు 14: రెండవ శనివారం

ఆగష్టు 15: ఆదివారం

ఆగష్టు 16: పార్సీ నూతన సంవత్సరం. (ముంబై, నాగపూర్, బెలాపూర్)

ఆగష్టు 19: మొహర్రం

ఆగష్టు 20: ఓనం

ఆగష్టు 21: తిరువొనం. (కొచ్చి, కేరళలలోని బ్యాంకులకు సెలవు)

ఆగష్టు 22: ఆదివారం

ఆగష్టు 23, 2021: శ్రీనారాయణ గురు జయంతి. (కొచ్చి, కేరళ బ్యాంకులకు సెలవు)

ఆగష్టు 28: నాలుగో శ‌నివారం

ఆగష్టు 29: ఆదివారం

ఆగష్టు 30: జన్మాష్టమి

ఆగష్టు 31: శ్రీ కృష్ణాష్టమి

Share post:

Latest