ఆ యంగ్ డైరెక్ట‌ర్ సినిమాలో జయమ్మ కీ రోల్‌..?!

వరలక్ష్మి శరత్‌కుమార్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తూ దూసుకుపోతోంది. ఇ

టీవ‌ల రావితేజ హీరోగా తెర‌కెక్కిన క్రాక్ సినిమాలో జ‌య‌మ్మగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన వ‌ర‌ల‌క్ష్మి.. ఇప్పుడు మ‌రో తెలుగు సినిమాలో కీ రోల్ పోషించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అ!, కల్కి, జాంబీరెడ్డి వంటి విభిన్న‌మైన చిత్రాల‌తో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ.. త‌న నాలుగో చిత్రం హను-మాన్ అంటూ ప్ర‌క‌టించాడు.

ఈ సారి ఇండియన్ రియల్ సూపర్ హీరో మీద సినిమా తీసేందుకు రెడీ అయ్యారు ఈ యంగ్ డైరెక్ట‌ర్‌. అయితే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌న్న‌ది ఇంకా ప్ర‌క‌టించ‌క‌పోయినా.. ఇందులో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతోంద‌ట‌. ఆ పాత్ర సినిమాకే హైలైట్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

Share post:

Latest