థర్డ్ వేవ్‌లో పిల్లలకు ప్రమాదం లేనట్టేనా…?

థర్డ్ వేవ్‌లో పిల్లలకు ప్రమాదం లేనట్టేనా…? ప్ర‌స్తుతం క‌రోనా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. అయితే రానున్న థ‌ర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు ఉందనే ప్ర‌చారం ఇప్ప‌టికే ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తెగ భ‌య‌ప‌డుతున్నారు. కాగా తాజా క‌రోనా పరిస్థితుల్లో ద లాన్సెట్ జర్నల్ ఆధ్వర్యంలో ఓ స‌ర్వే చేయ‌గా.. సంచ‌ల‌న విషయాలు వెలుగుచూశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రానున్న థర్డ్ వేవ్ లో చిన్న పిల్లలకు ముప్పు ఉంటుంద‌న‌డానికి ఎలాంటి స్ప‌ష్ట‌మైన ఆధారాలు లేవని లాన్సెట్ జర్నల్ స‌ర్వేలో వెల్ల‌డైంది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన ఓ నివేదిక ప్రకటించారు. పిల్లలకే థ‌ర్డ్ వేవ్ ముప్పు ఎక్కువని చెప్పేందుకు గ‌ల ఆధారాలు దొరకలేద‌ని అందులో వెల్ల‌డించారు. ఇప్పుడున్న అందరిలాగే వారికీ కూడా జ్వరం, శ్వాస, వాంతులు లాంటివి అవుతాయి అలాగే వైరస్ లక్షణాలు స్వల్పంగా బ‌య‌ట‌ప‌డుతాయ‌ని కానీ మ‌రీ ప్ర‌మాద‌క‌రం కాద‌ని స్ప‌ష్టం చేశారురు. ఇతర దేశాల పిల్లలకు, భారత్‌లోని చిన్నారుల‌కు పెద్దగా ప్ర‌భావంలో తేడాలుండ‌వ‌ని చెప్పింది.

Share post:

Latest