తీన్ మార్ స్టెప్స్ తో కీర్తి …!

ప్ర‌స్తుతం తెలుగుతో పాటే తమిళ, మలయాళ భాష‌ల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ మాత్ర‌మే. ఆమె మోడ్రన్ మహానటిగా దూసుకుపోతోంది. ఈ స్టార్ హీరోయిన్ ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్‌గా క్ర‌ష్‌గా మారిపోయింది. మహానటి ఆమె కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. ఈ తరం హీరోయిన్లలో దాదాపుగా ఎవరికీ సాధ్యం కాని విధంగా సావిత్రి రోల్‌కు ప్రాణం పోసి నేషనల్ అవార్డు కూడా ఎగ‌రేసుకుపోయింది.

అయితే ఆమె ఇప్ప‌టి దాకా చేసిన మూవీల్లో ఎప్పుడూ కూడా హద్దులు దాటలేదనే చెప్పాలి. గ్లామర్ షోలో కూడా తన పరిమితికి మించి ఎప్పుడూ న‌టించ‌లేదు ఈ భామ‌. అయితే జూన్ 22న ద‌ళ‌ప‌తి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ ఒక్కో విధంగా విషెస్ చెప్పారు. ఇక విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో కీర్తి సురేష్ కూడా ఉన్నారు. అయితే విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈమె అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసింది. విజయ్ కోసం తీన్‌మార్ స్టెప్పులు వేసి మ‌రీ విషెస్ చెప్పింది. ఇందులో ఏకంగా షర్ట్ బటన్స్ విప్పేసి మ‌రి రెచ్చిపోయింది.

Share post:

Latest