సమంత‌కు హ‌గ్ ఇచ్చినా రౌడీ హీరో..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న సినిమా పుష్ఫ‌క విమానం. ఈ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. కాగా సినిమాకు దామోద‌ల డైరెక్ష‌న్ వ‌హిస్తున్నారు. కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీని తీస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి ఓ వెడ్డింగ్ సాంగ్ ను ఈ రోజు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని స‌మంత విడుడ‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా స‌మంత త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా ఈ సాంగ్ ను లాంచ్ చేసిన పోస్టు చేసింది.

తాను ఈ సాంగ్‌ను లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని పేర్కొంది స‌మంత‌. టీం అంద‌రికీ కంగ్రాట్స్ చెప్పింది సామ్‌. ఇక త‌న త‌మ్ముడి పాట‌ను స‌మంత లాంచ్ చేసింనందుకు గానూ రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొంత థాంక్స్ తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు. థాంక్యూ సామ్ బిగ్ హ‌గ్స్ తో పాటు ప్రేమ అంటూ విజ‌య్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Share post:

Latest