సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మెగాస్టార్.?

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న చేసిన ప్ర‌తి సినిమాలో ఆయ‌న లుక్ డిఫ‌రెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. ప్ర‌స్తుం ఆయ‌న బ్లాక్ బస్టర్ ద‌ర్శ‌కుడు అయిన కొరటాల శివ తెర‌కెక్కిస్తున్న ఆచార్య సినిమాలో న‌టిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. అయితే ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మ‌రో హీరోగా చేస్తుండ‌టంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

అయితే ఆచార్య సినిమా కోసం డిఫరెంట్ హెయిర్ స్టయిల్ మెయింటేన్ చేస్తున్నారు చిరంజీవి. కాక‌పోతే ఇప్పుడు ఆయ‌న షూటింగ్ నుంచి క‌రోనా వ‌ల్ల కొంచెం బ్రేక్ తీసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. ఇదే క్ర‌మంలో ఆయ‌న నీల‌కంఠాపురం దేవాల‌యాల ఓపెనింగ్ చేసిన సంద‌ర్భంగా విడుద‌ల చేసిన వీడియోలో ఆయ‌న సాల్డ్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో మెస్మ‌రైజ్ చేశారు. మ‌రి ఈ లుక్ ఆచార్య‌లో ఉంటుందా అని అనుమానాలు క‌లుగుతున్నాయి. అది తెలియాలంటే వేచి చూడాలి.

Share post:

Latest