పూజా సినిమాకి న్యూ టైటిల్..?

ప్ర‌స్తుతం పూజాహెగ్ధేకు కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆమె సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఇప్పుడు ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ఆమె చేతి నిండా ఉన్న సినిమాలన్ని పాన్ ఇండియా మూవీలు కావ‌డంతో ఆమె రేంజ్ మ‌రోలా ఉండ‌బోతోంది. ఇక తాజాగా పూజా నటిస్తున్నసినిమా విషయంలో టైటిల్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారంట‌.

ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా హౌస్ ఫుల్-4 లో హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో పాటే కండ‌ల వీరుడు, సూప‌ర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ తో కబీ ఈద్ కబీ దీవాలి మూవీలో చేస్తోంది పూజా. అయితే ఈ మూవీ టైటిల్ కబీ ఈద్ కబీ దీవాలిని మార్చాల‌ని చూస్తున్నారంట మేక‌ర్స్‌. ఈ టైటిల్‌ను భాయిజాన్ గా ఛేంజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి త్వ‌ర‌లోనే దీన్ని మార్పు చేస్తార‌ని స‌మాచారం.

Share post:

Latest