త్రీపాత్ర అభినయంలో పవన్..?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి క్రేజ్ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజకీయ ప్రవేశం చేసినప్పుడు సినిమాలకు దూరం అవుతున్నట్లు చెప్పారు. కానీ ఫ్యాన్స్ చేసుకున్న అదృష్టం కొద్దీ ఆయన మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సినిమాను అందించారు. ప్రస్తుతం ఆయన ప‌లు బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల కరోనా బారిన పడి కోలుకున్న ప‌వ‌న్‌ కళ్యాణ్.. లాక్‌డౌన్ తర్వాత తాను ఒప్పుకున్న సినిమాల‌ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారట.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజూ ఏదో ఓకే గాసిప్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా వినబడుతున్న టాక్ ప్రకారం.. హ‌రిహ‌ర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ త్రిపాత్రభినయం చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ ను డైరెక్టర్ క్రిష్ అద్భుతంగా డిజైన్ చేశాడట. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. జులై నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.