ఆ సినిమా పై మాధ‌వ‌న్ క్లారిటీ..!

ఆనాటి హీరోల్లో లవర్ బాయ్ మాధవన్ ఇప్పటికీ అదే రేంజ్ లో ఉన్నాడు. తన స్టైల్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ హీరో రామ్ లింగుస్వామి డైరెక్ష‌న్ లో తెలుగు, త‌మిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో మాధవన్ నటిస్తున్నాడంటూ ఓ టాక్ వినిపిస్తోంది. హీరో మాధ‌వ‌న్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని సినీ ప్రేమికులు గుసగుసలాడుతున్నారు. తాజాగా దీనిపై మాధ‌వ‌న్ స్పందించాడు.

ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. లింగుస్వామి లాంటి డైరెక్ట‌ర్ తో ప‌నిచేయ‌డం చాలా బాగుంటుందని, అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో లింగుస్వామి మూవీలో నేను విల‌న్ గా న‌టించ‌నున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని హీరో మాధవన్ స్పష్టం చేశాడు. ఇప్ప‌టికే నాగ‌చైతన్య న‌టించిన స‌వ్య‌సాచిలో విల‌న్ గా క‌నిపించాడు. రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ తో డైరెక్ట‌ర్ గా మాధ‌వ‌న్‌ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు త్వరలో రాబోతున్నట్లు ఆయన తెలిపాడు.

Share post:

Latest