నాన్ స్టాప్ నవ్వులతో ‘లోల్ సలామ్’ ట్రైలర్..!

‘లోల్ సలామ్’ అనే పేరుతో తెరకెక్కిన ఫన్ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. టాలీవుడ్ హీరో నాని ట్విట్టర్ వేదికగా ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ ను రిలీజ్ చేసాడు. అలాగే ఈ అవుట్ అండ్ అవుట్ ఫన్ ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందంటూ తెలిపాడు. అయితే ఈ లోల్ సలామ్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ జీ5లో జూన్ 25నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే హైదరాబాద్ కు చెందిన స్నేహితుల బృందం కారులో హాలీడే ట్రిప్ బయలుదేరతారు.

అయితే ఓ అడవి మార్గం మధ్యలో ఆ కారు చెడిపోతుంది. ఆ టైంలో స్నేహితులు అటు ఇటు తిరుగుతుండగా వారిలో ఒకడు ల్యాండ్ మైన్ మీద కాలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా బయటపడ్డారు అనే కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా తెగ నవ్వులు పూయిస్తోంది. లోల్ సలామ్ గా ఈ వెబ్ సీరిస్ నవ్వులు పూయించడానికి సన్నద్దమవుతోంది.

Share post:

Latest