కొడాలి నానిపై నందమూరి వారసుడు ఆగ్రహం..?

వైసీపీ మంత్రి అయిన కొడాలి నానికి నటుడు, వ్యాపారవేత్త, నందమూరి వారసుడు అయిన చైతన్య కృష్ణ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడం,ఇష్టం వ‌చ్చిన‌ట్టు నోటికొచ్చినట్టు తిడితే ఊరుకోబోమని హెచ్చరించారు. నాని ఇప్పుడు లోకేష్ జోలికి వస్తే తాటతీస్తామంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇప్పటికే కొడాలి నానికి బూతులు మాట్లాడే మంత్రిగా పేరుంద‌ని, ఇప్ప‌టికైనా ఆయ‌న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిద‌ని చైత‌న్య కృష్ణ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక మంత్రి హోదాలో ఉన్న నాని సన్నాసి, దద్దమ్మ పప్పు అంటూ లోకేష్ ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్యాఖ్యానించ‌డం మానుకోవాల‌ని, తీవ్ర ఆగ్రహం తెలిపారు. నారా లోకేష్ ను వేస్ట్ ఫెలో అంటూ కావాల‌నే ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐటీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు నారా లోకేష్ యువతకు ఉద్యోగాలు ఇచ్చార‌ని, చంద్రబాబును విమర్శించే అర్హత కొడాలి నానికి లేదంటూ స్ప‌ష్టం చేశారు చైత‌న్య కృష్ణ‌.

Share post:

Latest