జులై1 నుంచి క్లాసులు ప్రారంభం…!

తెలంగాణ‌లో ఇప్పుడు క‌రోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. కాగా ఈ సంవ‌త్స‌రానికి సంబంధించిన ఆన్‌లైన్ క్లాసులు వ‌చ్చే నెల‌లో స్టార్ట్ అవుతున్నాయి. జులై 1 నుంచి ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్‌క్లాసులు ఆన్‌లైన్‌లో ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఇందుకు సంబంధించి మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇప్ప‌టికే ఇంట‌ర్‌బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు.

కాగా జులై 5వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ అడ్మిష‌న్లు న‌డుస్తాయి. ఆ త‌ర్వాత దూర‌ద‌ర్శ‌న్ తో పాటు టీశాట్, ఆన్‌లైన్‌లో క్లాసులు స్టార్ట్ చేస్తామ‌ని మంత్రి తెలిపారు.గ‌తేడాది సిల‌బ‌స్ నుంచే దాదాపు 70 శాతం పాఠాలు చెబుతామ‌న్నారు. అయితే టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని పేద స్టూడెంట్లు కాలేజీల‌కు వ‌చ్చి క్లాసులు వినేలా డిజిట‌ల్ లైబ్ర‌రీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు బోర్డు స్ప‌ష్టం చేసింది. ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఇందుకు చ‌క‌చ‌కా ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి.