బ్రేకింగ్ : కూక‌ట్‌ప‌ల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం.. !

భాగ్యనగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కూక‌ట్‌ప‌ల్లిలో స్థానికంగా ఉన్న ఏఈ ఎక్స్‌ప్రెస్ పార్కింగ్ యార్డులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగడంతో సమీపంలో పార్క్ చేసిన ప‌లు ఆటోలు, బైక్‌లు పూర్తిగా కాలిపోయినట్లుగా సమాచారం. ఇక ఈ ప్రమాద ఘటన తాలూకూ సమాచారాన్ని అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపుచేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటన స్థానికులే చేశారా? లేక మరెవరైనా కక్షపూరితంగా చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి వాతావరణాన్ని చక్కదిద్దుతున్నారు. స్థానిక ప్రజలు ఎవ్వరూ భయాందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్కింగ్ యార్డులో ఒక్కసారిగా మంటలు రావడం వల్ల ఆ ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణహాని జరగలేదు. అయితే ఆస్తి నష్టం మాత్రం వాటిల్లింది. ఘటనలో పేలిపోయిన ఆటోలు, వాహనాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Share post:

Latest