బెల్లంకొండ ‘చత్రపతి’ నుంచి లేటెస్ట్ అప్డేట్..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలారోజుల‌వుతున్నా.. క‌మ‌ర్సియ‌ల్ గా ఇంకా పెద్ద హిట్ అందుకోలేదు. దీంతో ఇప్పుడు ప్రభాస్ ను హీరోగా పెట్టి ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి తీసిన ఛ‌త్రపతిపై ప‌డ్డాడు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిన పెన్ స్టూడియో వారు వినాయక్ డైరెక్ష‌న్‌లో ఈ రీమేక్ ను చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ రీమేక్ రాబోతుంద‌ని తెలిసిందే.

ఎప్ప‌టి నుంచో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుండ‌గా.. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చారు మేక‌ర్స్‌. మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప‌నులు జరుగుతున్నాయ‌ని స‌మాచారం. హైదరాబాద్ శివారు ఏరియాల్లో ఈ మూవీ కోసం భారీ విలేజ్ సెట్టింగ్ వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ సెట్టింగ్ మెయిన్ సీన్స్ అన్నీ నిర్వ‌హిస్తార‌ని తెలుస్తోంది. వ‌చ్చే జులై లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేస్తారంట‌. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్ర‌కారం.. ముంబయి తో పాటు బంగ్లాదేశ్ లో కూడా షూటింగ్ చేస్తారంట‌.

Share post:

Latest