వారెవ్వా అనిపిస్తున్న బాల‌య్య కామ‌న్ డీపీ..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్రత్యేకమైన గుర్తింపును, అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం ఇటు సినీ రంగంలోనూ అటు రాజీక‌య రంగంలోనూ స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతున్న బాల‌య్య రేపు(జూన్ 10) 61వ పుట్టినరోజు జ‌రుపుకోనున్నారు.

- Advertisement -

అభిమానులకు బాలకృష్ణ పుట్టినరోజు అంటే పండగ లాంటిది. అయితే ఈ సారి కరోన వైరస్ కారణంగా ఎలాంటి వేడుకలు జరుప వద్దు అంటూ అభిమానులను వినయపూర్వకంగా కోరాడు బాలయ్య. దీంతో నంద‌మూరి అభిమానులు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కామన్ డీపీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

balayyabirthdaycdp - Twitter Search

అయితే తాజాగా బాలకృష్ణ కామన్ డీపీని నారా రోహిత్ విడుదల చేశారు. బాలకృష్ణ హెలికాప్టర్ నుంచి దిగుతున్నట్లుగా ఉన్న‌ ఈ కామన్ డీపీ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ లో సింహం గాండ్రిస్తున్నట్టుగా ఉన్న ఫోటోలో ఒక రాజ మహల్ లాంటి కోట, బాలకృష్ణ సంతకం కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి వారెవ్వా అనిపిస్తున్న బాల‌య్య కామ‌న్ డీపీ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Share post:

Popular