ఆ షో నుంచి సుమ ఔట్..?

యాంక‌ర్‌గా సుమ‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె ఏదైనా షోగానీ లేదా ప్రోగ్రామ్ గానీ చేస్తే ఫెయిల్ అయిన దాఖ‌లాలు లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన అన్ని ప్రోగ్రామ్‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. ద‌శాబ్ద‌కాలానికి పైగా ఆమ ఈటీవీలో స్టార్ యాంక‌ర్‌గా చ‌క్రం తిప్పుతోంది. ఇప్ప‌టికే ఆమె క్యాష్‌, స్టార్ మ‌హిళ లాంటి కార్య‌క్ర‌మాల‌ను చేస్తోంది. ఇప్పుడు క‌రోనా కార‌ణంగా షోలు లేక ఖాళీగా ఉంటోంది.

ఇదిలా ఉండ‌గా సుమ, రవి కలిసి హోస్టింగ్ చేస్తున్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌ను సుమ, రవి ఇద్దరూ కలిసి బాగానే లీడ్ చేస్తున్నారు. సుమ ఒక్కరు ఉంటేనే ఆ ప్రోగ్రామ్ క‌ల‌క‌ల‌లాడుతుంది. పంచ్‌ల‌కు కొదువ ఉండ‌దు. ఇకిద్ద‌రు ఉంటే ఎలా ఉంటుందోప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే సుమ లేకుండా ఈ ప్రోగ్రామ్ జ‌రుపుతున్నారు నిర్వాహ‌కులు. ఈ ఆదివారం ప్రసారం కాబోతోన్న ఓ ఎపిసోడ్‌లో గల్లీబాయ్స్ సద్దాం ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎపిసోడ్‌లో సుమ లేదు. దీంతో ఆమెను మొత్తంగా తీసేసారా లేక ఈ ఒక్క ప్రోగ్రామ్‌కు హాజరు కాలేకపోయిందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సుమ లేకుండా ప్రోమో రావడంతో హాట్ టాపిక్‌గా మారింది.

Share post:

Latest