పుష్పకవిమానం సాంగ్ లాంచ్ చేయనున్న సమంత.. ఎప్పుడంటే?

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనే కాదు ఆయన తమ్ముడు కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వతా ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న మరో సినిమా పుష్పక విమానం. టాలీవుడ్ నూతన దర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్ దామోదర ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. గీత్ సైని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

- Advertisement -

గోవర్ధన్ రావు దేవరకొండ – విజయ్ దషి – ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “పుష్పక విమానం” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 18న ఉదయం 11 గంటలకు ‘కళ్యాణం’ లిరికల్ సాంగ్ ను సమంత విడుదల చేయనున్నారు. హీరో హీరోయిన్ల వివాహం సందర్భంగా వచ్చే ఈ పాటకు రామ్ మిరియాల ట్యూన్ కంపోజ్ చేయగా గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. యువ సంచలనం సిధ్ శ్రీరామ్ – మంగ్లీ కలిసి ఈ పాటను ఆలపించారు.

Share post:

Popular