మొక్క‌లు నాటి ఫొటోలు పంపండిః బ‌న్నీ

ఈ రోజు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం జ‌రుపుకుంటున్నాం మ‌నం. అయితే ఈ సంద‌ర్భంగా చాలామంది చాలా ర‌కాలుగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే క్ర‌మంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసి వైర‌ల్‌గా మార్చారు. ఆయ‌న త‌న ట్వీట్‌లో ఈ విధంగా చెప్పుకొచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

జూన్ 5న ప్ర‌పంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి మన ఈ భూమిని కాపాడుకునే అవ‌స‌రం మనకు ఎంతైనా ఉందన్నారు. ఇప్పుడున్న క‌లుషితాన్ని తగ్గించడానికి అంద‌రూ మొక్కలు నాటాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ రోజు ఒక మొక్క‌ను నాటి ఆ ఫొటోల‌ను త‌న‌కు షేర్ చేయాల‌ని బ‌న్నీ కోరారు. వాటిలో కొన్ని ఫోటోలను త‌న ట్విట్టర్ లో షేర్ చేస్తాన‌ని అర్జున్ వివ‌రించారు. ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాల‌ని కోరారు. ఇప్పుడు ఈ ట్వీట్ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక బ‌న్నీ ట్వీట్ అందుకున్న ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Share post:

Latest