“ఆదిపురుష్” రావణ్ పాత్రపై సరి కొత్త అప్డేట్.. !

ప్రభాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు. ఆయ‌న ఇప్పుడు చేస్తున్న బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ పై ఎన్నో అంచనాలున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. నార్మ‌ల్ గా అయితే ఈ పాటికే షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించే వారు మేక‌ర్స్‌. హైదరాబాద్ లోనే ఎక్కువ పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నా.. క‌రోనా అడ్డుప‌డింది. కానీ ప్ర‌స్తుతం ఉన్న కొవిడ్ ఓమ్ రౌత్ ప్లాన్స్ ను దెబ్బ‌కొట్టింది.

అయితే ఇప్పుడు ఈ మూవీలో రావ‌ణుడిగా న‌టిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పైనే హైద‌రాబాద్‌లో షూటింగ్ ఉంటుందని స‌మాచారం. ఆదిపురుష్ లో ఆయన పాత్ర కూడా ప్ర‌భాస్ రేంజ్‌లోనే ఉంటుందని స‌మాచారం. కాగా రావణ్ గా న‌టిస్తున్న సైఫ్అలీకాన్ పై ముంబయిలో వేసిన భారీ సెట్‌లో కొన్ని సీన్స్ తెరకెక్కించబోతున్నారు. ఆ త‌ర్వాత హైదరాబాద్ చేరుకోనుంది ఈ మూవీ టీమ్. హైదరాబాద్ లో షూటింగ్ కోసం ఇప్పటికే చాలా ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసేలా ఓమ్ రౌత్ ప్లాన్ చేస్తున్నారు.

Share post:

Latest