పవన్ సినిమాలో ఆ స్టార్ డైరెక్టర్ రోల్ ఏమిటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో జోరుమీదున్నారు. ఆయ‌న హీరోగా నటిస్తున్న ప్ర‌స్తుత మూవీ అయ్యప్పణం కోషియం. ఇది రీమేక్ మూవీ. ఈ మూవీపై మాస్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ షూట్ రీస్టార్ట్ కావ‌డానికి ప్ర‌స్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ మూవీలో స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ కూడా ఒక రోల్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

రీసెంట్ గా ఆ విష‌యం నిజమే అని ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాగా దానిపై స్వయంగా డైరెక్ట‌ర్ వివి వినాయక్ నే లేటెస్ట్ ఇచ్చిన ఇచ్చిన ఓ స్మాల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం పవన్, రానా లు చేస్తున్న మూవీలో తాను ఓ చిన్న రోల్ చేసానని, అది కూడా ఒక సినిమా డైరెక్టర్ గానే కనిపిస్తానంటూ ఆయ‌న ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ మూవీకి సాగర్ కె చంద్ర డైరెక్ష‌న్ చేస్తున్నారు.

Share post:

Latest