ఉత్తరప్రదేశ్ లో శవాల ప్రవాహం..కారణం ఏమిటంటే..?

క‌రోనా మ‌ర‌ణ మృదంగం దేశంలో ఏ స్థాయిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర భార‌త‌దేశంలో దీని తీవ్ర‌త తారా స్థాయిలో ఉంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో అయితే క‌రోనా మృత‌దేహాల‌ను క‌న‌నం చేయ‌డానికి ప్లేస్ లేక ఎక్క‌డ బ‌డితే అక్క‌డ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇదే క్ర‌మంలో గంగాన‌ది ఒడ్డున ఇసుక తిన్నెల్లో మృతదేహాల‌ను క‌ప్పిపెడితే అప్ప‌ట్లో ఇవ‌న్నీ న‌దిలోకొట్టుకు రావ‌డం పెద్ద ఎత్తున సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు మ‌రోసారి అదే స్థాయిలో క‌రోనా మృత‌దేహాలు న‌దిలో కొట్టుకు వ‌స్తున్నాయి ఉన్నావ్ జిల్లాలోని న‌దీ ప్ర‌వాహంలో మ‌రికొన్ని మృత‌దేహాలు ఇలాగే కొట్టుకొచ్చాయి. దీంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. న‌దీ ఇసుక తిన్నెల్లో పాతిపెట్టిన మృత‌దేహాలు ప్ర‌వాహం పెర‌గ‌డంతో ఇసుక కొట్టుకుపోయి శ‌వాలు కొట్టుకువ‌స్తున్నాయి. అయితే తాము ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని, ఎలాంటి మృత‌దేహాలు క‌నిపించ‌లేద‌ని ఆఫీస‌ర్లు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివ‌రాలు స్ప‌ష్టంగా తెలియాల్సి ఉంద‌ని స్థానికులు చెబుతున్నారు.

Share post:

Latest