ఆ నటుడి భార్య ఆత్మహత్య..వేధింపులే కారణమా

టాలీవుడ్ లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజన్ పి దేవ్. ఆయన ఆది సినిమాలో మెయిన్ విలన్‌గా నటించారు. దాంతో పాటు ఖుషి, దిల్, ఒక్కడు లాంటి సినిమాలు కూడా చేసాడు. దాదాపు మళయాలంలో 200 సినిమాలకు పైగానే నటించిన ఈయన 2009లో మరణించాడు. ఆయన తనయుడు ఉన్ని రాజన్ కూడా మలయాళంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా బిజీ అవుతున్నాడు. ఇటువంటి సమయంలో ఆయన భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మలయాళంలో దాదాపు 30 సినిమాలకు పైగానే నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఉన్ని రాజన్ భార్య ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తమ అల్లుడే చంపేసాడని అమ్మాయి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఉన్ని రాజన్.. ప్రియాంక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్ని రోజుల నుంచే వీళ్లిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. తారా స్థాయికి వెళ్లిన తర్వాత కూడా ఇరు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నఫలంగా ప్రియాంక ఆత్మహత్య చేసుకొని చనిపోవడం మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Share post:

Popular