బ్రేకింగ్: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ గడువు పొడిగింపు..!

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న రాత్రిపూట కర్ఫ్యూను మరికొన్ని రోజులు తెలంగాణ సర్కార్ పొడిగించింది. రేపు ఉదయం వరకు రాత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలోనే తిరిగి దాన్ని పొడగించారు. వారం పాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ముందుగా 15రోజులపాటు రాత్రి కర్ఫ్యూ విధించింది. అనంతరం మే ఒకటిన రెండవసారీ విధించగా ప్రభుత్వం పొడిగించిన గడువు రేపటితో ముగియనుంది.

దీంతో మరోసారి రాత్రి కర్ఫ్యూను మే 15వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణలో ఫస్టు డోస్ వ్యాక్సిన్ ను తాత్కాలికంగా నిలిపి వేస్తునట్టు ప్రభుత్వం తెలిపింది. రేపటి నుంచి కేవలం సెకండ్ డోస్ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ కొరత వల్ల మే 15 వరకు ఫస్టు డోస్ వ్యాక్సిన్ నిలిపివేస్తునట్టు అధికారులు తెలిపారు. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షలకు పైగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.