శ్రీరెడ్డి పై వైసీపీ రెబల్ షాకింగ్ కామెంట్స్..?

శ్రీరెడ్డి అంటే వివాదానికి పెట్టింది పేరు అని చాలా మంది అంటుంటారు. ఆమె ఏ కామెంట్ చేసినా వివాదాస్పద మవుతుంది. ఈ మధ్య కొందరు సినీ ప్రముఖులు ఎప్పుడు శ్రీరెడ్డి ఎవరిపై కామెంట్ చేస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. సెలబ్రిటీలనే కాకుండా పొలిటీషియన్స్ ను కూడా శ్రీరెడ్డి మాటలతో మడతెట్టేస్తారు. గతంలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన శ్రీరెడ్డి తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పై బూతు పురాణం కుమ్మరించింది. ఆయన్ని తిడుతూ సోషల్ మీడియాలో నానా హంగామా చేసింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజును బండ బూతులు తిట్టడం, ఆమెను కూడా ఎంపీ తనదైన శైలిలో తిట్టడం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఎంపీని శ్రీరెడ్డి గాజుగాడు, విగ్గురాజు అంటూ తిడుతూనే బీజేపీ అండ చూసుకుని ర‌ఘురామ కృష్ణం రాజు రెచ్చిపోతున్నార‌ని ఫైర్ అయ్యింది. వైసీపీ గుర్తుపై గెలిచి డ్రామాలేస్తున్నావేంటి అంటూ రెచ్చిపోయింది. వైసీపీ జోలికి వచ్చినా జగన్‌ని అన్నా తానే కౌంటర్ ఇస్తా అంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల‌పై ర‌ఘురామ కృష్ణంరాజు రిప్లై ఇచ్చారు. కొంద‌రు దొంగ‌ రెడ్లు కొత్త‌గా త‌మ‌కు ఓ కుల‌ దేవ‌త‌, శృంగార దేవ‌త‌ను ఎన్నుకున్నార‌ని శ్రీరెడ్డి ఉద్దేశించి కౌంట‌ర్ ఇచ్చారు. కొంద‌రు ల‌ఫుట్‌గాళ్లు తెర వెనుక ఉండి ఆమెతో త‌న‌ను తిట్టిస్తూ వీడియోలు చేయిస్తున్నార‌ని ఆరోపించారు. 10 శాతం ప‌నికిరాని రెడ్ల కుల దేవ‌త‌, పతివ్ర‌త అంటూ శ్రీరెడ్డిపై వివాదాస్పద కామెంట్లు చేశారు.

Share post:

Latest