స్మగ్లింగ్ కేసులో కమెడియన్..?

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ నటుడి పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. స్మగ్లింగ్ చేస్తూ గతంలో ఓ సారి పట్టుబడిన జబర్దస్త్ నటుడు హరి పేరు తాజాగా మరో కేసులోనూ వినిపిస్తోంది. శేషాచలం అడవుల్లో అధికారులు నిర్వహించిన కూంబింగ్ లో నాగపట్ల, వెస్ట్ బీట్‌, చీకిమానుకోన ద‌గ్గ‌ర 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ప‌ట్టుబ‌డ్డారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువగల ఎర్రచందనం దుంగలు, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గ్యాంగ్ తో జబర్దస్త్ హరికి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు, ఈ అంశంపై జబర్ధస్త్ హరి స్పందించాడు. పోలీసులు కావాలనే తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని వాపోయాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ తనకు సంబందం లేదని చెబుతున్నాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే తాను పోలీసులకు సమాచారం అందించానని, ఆ కోపంతో అతను తనపై తప్పుడు కేసులు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share post:

Latest