శిఖర్‌ ధావన్‌ గొప్పమనసు..ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు సాయం

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కోవిడ్ బాధితులు చాలా మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. కరోనా టైంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందడుగు వేస్తున్నారు. తమ వంతు సాయంగా ఎంతోొ కొంత ఇస్తూ కన్నీల్లను తుడుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవాయువు అవసరం పెరిగిపోతున్నందున ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తూ సెలబ్రిటీలు, క్రీడాకరులు, ధనవంతులు తమకు తోచిన సాయం అందిస్తున్నారు. టీమ్‌ఇండియా సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను డొనేట్‌ చేశాడు. కరోనా సెకండ్‌ వేవ్‌లో మహమ్మారిపై పోరాటంలో సహాయపడటానికి ధావన్‌ గురుగ్రామ్‌ పోలీసులకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందజేశాడు. ధావన్‌ చేసిన సాయానికి పోలీసులు సోషల్‌మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా ధావన్ ఇరవై లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. క్రీడాకారులు తమ వంతుగా ఇలా ముందుకు వచ్చి సాయం చేస్తుండటం గొప్ప విషయమని పోలీసులు తెలిపారు.

Share post:

Popular