సంపూ ‘క్యాలీఫ్లవర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ …!

బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లో పేరుపొందిన సంపూర్ణేష్ బాబు ఈసారి మరో ప్రయోగంతో దూసుకొస్తున్నాడు. అతడి గెటప్ అసాధారణంగా ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చెబుతోంది. నేడు సంపూ బర్త్ డే సందర్భంగా కెరీర్ లో ఐదో సినిమా అయిన `క్యాలీఫ్లవర్` లుక్ లాంచ్ అయ్యింది. గుర్రంపై సంపూ దూసుకొస్తున్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు తెల్లదొరగా ఉన్నారు.

మొదటి బ్యాంగ్ వీడియోలో భారతీయ మహిళా స్వచ్ఛత గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చే వ్యక్తిగా అతడి పాత్ర ఆకట్టుకుంది. ఇది పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ అని దర్శకుడు ఆర్.కె.మలినేని తెలిపారు. గోపి కిరణ్ ఈ కథను రాయగా మధుసూధన క్రియేషన్స్ – రాధాకృష్ణ టాకీస్ బ్యానర్ లలో ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. శ్రీధర్ గూడూరు ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. సంపూ సరసన వసంత కథానాయికగా నటిస్తున్నారు.

Share post:

Latest