వైరల్: బామ్మ చేసిన పనికి ఇంప్రెస్ అయిన జెనీలియా భ‌ర్త‌..?

ఈరోజుల్లో ఏవిషయం జరిగినా ఆ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకోవడం అందరికీ అలవాటైపోయింది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా అనేది తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఉపయోగపడే ఒక ఫ్లాట్ ఫామ్ గా కూడా ఉపయోగపడుతోంది. కొందరు సోషల్ మీడియాను ఉపయోగించి పాపులర్ అవుతుంటే మరికొందరు మంచి గుర్తింపుతో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడొక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఓ వృద్దురాలు ఆ ఆట ఆడిన తీరు చాలా మందిని పొగిడేలా చేసింది. ముసలామె ఆడిన ఆట తీరుకు జెనీలియా భ‌ర్త‌, బాలీవుడ్ న‌టుడు రితేష్ దేశ్‌ముఖ్ బామ్మ‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. సుద‌ర్శ‌న్ కృష్ణ‌మూర్తి అనే వ్య‌క్తి తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో బామ్మ బాల్‌ని విసిరేసి అన్నింటిని కింద ప‌డేసిన వీడియో షేర్ చేశారు. వీడియోలో బామ్మ చీర క‌ట్టుకొని, ముఖానికి మాస్క్ ధ‌రించి అన్నింటిని ప‌డ‌గొట్టడంతో ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు. బామ్మ ప్ర‌తిభ‌కు ఫిదా అయిన రితేష్‌ బాస్ లేడి అంటూ కామెంట్ చేశారు.

Share post:

Latest