స్పార్క్ ఓటీటీలో బిగ్ బాస్ బ్యూటీ సినిమా..?

తెలుగు ప్రేక్షకులను బిగ్ బాస్ కార్యక్రమం ఎంతగానో అలరించింది. అంతేకాదు ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది సెలబ్రిటీలు ఫేమస్ అయిపోయారు. బిగ్ బాస్ తర్వాత తాము అనుకున్నది సాధించుకుంటూ విజయాన్ని పొందుతున్నారు. మంచి సినిమా ఆఫర్లు రావడంతో బిజీగా మారిపోతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 4తో ఫేమస్ అయిన న‌టి దివికి అనేక చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈమె తాజాగా క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో న‌టించింది.

ఇందులో గిరిధ‌ర్, ధ‌న్‌రాజ్, ప్ర‌వీణ్‌,శ్రీహాన్, సిరి కీల‌క పాత్ర‌లు పోషించారు. కొత్త కాన్సెప్ట్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందించబడిన ఈ చిత్రాన్ని ‘గాలి సంపత్’ సినిమాతో నిర్మాతగా మారిన ఎస్ కృష్ణ నిర్మించారు. కెవిఎన్ రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కరోనా వ‌ల‌న థియేట‌ర్‌లు మూత‌ప‌డ‌డంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేసేందుకు స‌న్న‌హాలు చేస్తున్నారు రామ్ గోపాల్ వ‌ర్మ‌ ఓటీటీని స్థాపించిన విష‌యం తెలిసిందే. ఇందులో తొలుత వ‌ర్మ తెర‌కెక్కించిన డి చిత్రం విడుదలైంది. ఇక ఇప్పుడు దివి న‌టించిన క్యాబ్ స్టోరీస్ అనే చిత్రం మే 28న డిజిటల్ ప్రీమియర్ కోసం సన్నద్ధమవుతోంది.

Share post:

Latest