వరుసగా 7 సినిమాలను లైన్లో పెట్టిన ఢిల్లీ భామ..!?

రాశిఖన్నా అంటే చాలా మందికి టక్కున గుర్తొచ్చే సినిమా ఊహలు గుసగుసలాడే. ఈ సినిమాలో ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో ఆమెకు ఈ సినిమా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇటు తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె అనేక మోడల్ రోల్ సినిమాలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. ఢిల్లీకి చెందిన ఈమె ‘ఇమైకనొడిగళ్’ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని అందించింది.

ప్రస్తుతం ఈ హీరోయిన్ అరణ్మనై-3 – మేధావి – తుగ్లక్ దర్బార్ – సర్దార్ – సైతాన్ క బచ్చా ఇలా వరుసగా తమిళ సినిమాలలో నటిస్తోంది. తమిళ ఇండస్ట్రీలో ఈ చిన్నదానికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉండటం వల్ల ఆమె తన మార్క్ ను అందుకోవాలని ఇంకా మరిన్ని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తెలుగులోకూడా రెండు మూడు సినిమాలు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తోంది. అలాగే నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో నటిస్తోంది.

Share post:

Latest