ఆ నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన యాక్టర్ కూతురు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న వారిలో సురేఖవాణి ఒకరు. సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కేవలం సినిమాలలోనే మాత్రమే కాకుండా సురేఖ వాణి, సుప్రితకి సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక మరోవైపు సురేఖ వాణి, సుప్రీత ఇద్దరూ కూడా నెట్టింట్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అలాగే సురేఖ వాణి కంటే ఆమె కూతురు సుప్రీత్ సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.

అంతేకాకుండా సుప్రీత ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో లైవ్ చాట్‌ స్టేషన్లు పెడుతూ తన ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు ముచ్చట పడుతూ యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికి విదితమే.. లైవ్ స్టేషన్ లలో కొంత మంది నెటిజన్లు పర్సనల్ ప్రశ్నలు, అలాగే అడగకూడని కొన్ని ప్రశ్నలు అడిగేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సుప్రీత తనదైన స్టైల్ లో ఘాటుగా కౌంటర్ తో సమాధానం ఇస్తుంది. ఇది ఇలా ఉండగా సుప్రీత తాజాగా సోషల్ మీడియాలో లైవ్ సెషన్ పెట్టగా అందులో భాగంగానే ఏదైనా ప్రశ్నలు అడగండి సమాధానాలు చెబుతాను అని నెటిజన్స్ ను కోరగా.. ఈ క్రమంలో ఒక నెటిజెన్ “ఆర్ యు వర్జిన్” అని అడగకూడని ప్రశ్నే అడగగా.. దానికి సుప్రీత కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇస్తూ.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా లో కోర్టు సీన్ ను ఉపయోగించుకుంది. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ అంజలిని అడిగినట్టు పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోతూ అబ్జెక్షన్ అంటూ కోర్టు గందరగోళం సృష్టించిన సీన్ ను సుప్రీతను అడిగిన ప్రశ్నకు సమాధానంగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

Share post:

Popular