పెళ్లిపై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్‌..ఏం చెప్పిందంటే?

కీర్తి సురేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత కీర్తి ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం మ‌రియు మ‌ళ‌యాళ చిత్రాల‌తో బిజీ బిజీగా గడుపుతోంది.

- Advertisement -

ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ పెళ్లిపై గ‌త కొద్ది రోజుల నుంచ అనేక వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తో కీర్తి పెళ్లి ఫిక్స్ అయింద‌ని వార్త‌లు రాగా.. అవి పుకార్లే అని తేలిపోయాయి. అయితే ఇప్పుడు మ‌రోసారి కీర్తి పెళ్లి టాపిక్ తెర‌పైకి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే చెన్నైకి చెందిన ఒక వ్యాపార వేత్తతో ఆమె వివాహం జరగనుందనే ప్రచారం జరుగుతోంది.

అయితే తాజాగా పెళ్లిపై వార్త‌ల‌పై కీర్తి షాకింగ్ కామెంట్స్ చేసింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలో ఎంతమాత్రం నిజం లేదని.. అస‌లు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని తెగేసి చెప్పింది కీర్తి. తన దృష్టి మొత్తం సినిమాల మీదే ఉందని, ముందు పని ఆతర్వాతే ఏదైనా అని.. ఒక‌వేళ తనకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే, అబ్బాయిని ఫైనల్ చేసుకుంటే ఆదరికంటే ముందే నేనే వెల్ల‌డిస్తానని కీర్తి తెలిపింది.

Share post:

Popular