నేటి ఐపీల్ మ్యాచ్ రద్దు ..కారణం ఏమిటంటే..?

ప్రపంచం అంతా కరోనా కారణంగా అతకుతలం అయిపోతున్నారు. రోజు రోజుకి దేశంలో భారీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు కరోనా కారణంగా నేడు జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దు అయింది. చివరికి ఐపీఎల్ పై కూడా కరోనా పంజా విసురుతుంది. ఇవాళ అహ్మదాబాద్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లేదు. మోదీ స్టేడియంలో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కాస్త కరోనా కారణంగా వాయిదా పడిపోయింది.

- Advertisement -

కోల్కతా నైట్ రైడర్స్ క్ర్ ప్లేయర్స్ అయిన వరుణ్ చక్రవర్తి ఇంకా సందీప్ వారియర్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయిందన్న సంగతి బీసీసీఐ తెలిపింది. కాబ్బటి మ్యాచ్ ని రీషెడ్యూల్ చేస్తామని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ తో పాటు మిగతా ప్లేయర్స్ ని కూడా ఐసొలేషన్ లో ఉంచారు.

Share post:

Popular