ఐపీఎల్ 14 మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే..!

ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ఐపీఎల్ 14వ సీజన్ కరోనా వైరస్ పుణ్యమా అంటూ సగం మధ్యలోనే ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్ లను ఎలాగైనా పూర్తి చేయాలని బిసిసిఐ పట్టుదలతో ఉన్నట్లు కనబడుతోంది. ఇందుకు సంబంధించి బిసిసిఐ, ఐపీఎల్ కమిటీ అనేక చర్చల నేపథ్యంలో మిగిలిన మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుండి యూఏఈ వేదికగా మ్యాచ్ లు మొదలుపెట్టాలని బీసీసీఐ ఫిక్స్ అయ్యింది.

ఇందులో భాగంగానే అక్టోబర్ 10న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని.. అలాగే మిగిలి ఉన్న మ్యాచ్ లలో మొత్తం 10 డబుల్ హెడ్ మ్యాచ్ లు, అలాగే 7 రాత్రి మ్యాచ్ లు రీషెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఇలా మొత్తం ప్రస్తుతం సీజన్లో మిగిలి ఉన్న 31 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ మ్యాచ్ ల టైమింగ్స్ లో అన్ని ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్ లకు అనుకూలంగా ఉండేలా బిసిసిఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Share post:

Latest