ఐసీఎంఆర్ నివేదిక వ‌చ్చాకే క‌రోనా మందు పంపిణీః ఆనంద‌య్య‌

ఈ క‌రోనా క‌ష్ట‌స‌మ‌యంలో ఓ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఆయ‌న కోసం న‌లువైపుల నుంచి క‌రోనా పేషెంట్లు వ‌స్తున్నారు. ఎక్క‌డ చూసినా ఆయ‌న గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న వేసిన మందు ప‌నిచేస్తుంద‌ని కొంద‌రు, లేదు ప్రమాదం అంటూ మ‌రి కొంద‌రు గ‌త మూడు రోజులుగా చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. సోష‌ల్ మీడియాలో అయితే మందు ప‌నిచేస్తోంద‌ని, అల్లోప‌తి ఏమైనా గ్యారంటీ ఉంటుందా అంటూ కొంద‌రు పోస్టులు పెడుతున్నారు.

అయితే ఈ మందు గురించి చాలా మందికి తెలియడంతో హాస్పిట‌ళ్లు దాదాపు ఖాళీ అవుతున్నాయి. చాలా మంది కృష్ణ‌ప‌ట్నంకు రావ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొని, మందు పంపిణీని ఆపేసింది ప్ర‌భుత్వం. ఈ మందుపై సీఎం జ‌గ‌న్ రివ్యూ చేసి, ఐసీఎంఆర్ టీమ్‌ను కృష్ణ‌ప‌ట్నంకు పంపించారు. మందు ప‌నితీరుపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. అయితే ఐసీఎంఆర్ టీమ్ ఈ మందు ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని తెలిపింది.

ఇంకోవైపు లోకాయుక్త కూడా దీన్ని ప్ర‌మాద‌క‌ర‌మైన మందు కాద‌ని తేల్చి చెప్పింది. అయితే మందును ఎప్ప‌టి నుంచి పంపిణీ చేస్తారో తెలియ‌క గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఆయుర్వేద వైద్యుడు డాక్ట‌ర్ ఆనంద‌య్య ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డితో క‌లిసి మీడియాతో మాట్లాడారు. త‌న మందుకు ఐసీఎంఆర్ నుంచి పూర్తి స్థాయి అనుమ‌తులు, నివేదిక వ‌చ్చాకే పంపిణీ చేస్తామ‌ని వివ‌రించారు. తన మందుపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా ఉండ‌టం పెట్టడం లా ఆనందంగా ఉందన్నారు.

తను మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ టీం నిర్ధారించింద‌ని వెల్ల‌డించారు. నివేద‌కి వ‌చ్చాక పంపిణీపై ఎమ్మెల్యేతో క‌లిసి ప్రణాళిక రూపొందిస్తామ‌ని వివ‌రించారు. త‌న మందుపై ఎటువంటి ఆరోపణలు మంచివి కావ‌ని, అనుమానాలు వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు.