గాంధీభవన్ పటేల్ నగర్లో ఉద్రిక్తం.. అల్ల‌రిమూక‌ల వీరంగం..

హైద‌రాబాద్ గాంధీభవన్ పటేల్ నగర్ బ‌స్తీలో ఉద్రిక్త‌త నెల‌కొంది. బ‌స్తీలో స్పీడ్ డ్రైవింగ్ చేయ‌వ‌ద్ద‌ని సూచించినందుకు కొంతమంది అల్ల‌రు మూకలు బ‌స్తీకి చెందిన‌ పెద్ద శేఖర్ తో పాటు మరో వ్యక్తి సతీష్ పై దాడికి పాల్పడ్డారు. సతిష్ కు తీవ్ర గాయాలు కాగా, వారిని హుటాహుటిన వైద్య‌శాల‌కు తరలించారు బేగంబజార్ పోలీసులు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సెంట్రల్ జోన్ ఆడిసినల్ సిపి విశ్వ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నాయి. భారీగా పోలీసులు మోహరించ‌డంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని స్థానికులు ఆందోల‌న చెందుతున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే..

బ‌స్తీకి చెందిన కొంద‌రు యూవకులు గాంజా తాగి నిత్యం అల్లర్లు సృష్టిస్తున్నారు. కాల‌నీల్లో వేగంగా వాహ‌నాల‌ను న‌డుపుతున్నారు. ఎప్ప‌టిలాగే ద్విచక్రవాహనంపై అతివేగంతో వెళ్తున్న అల్లరిముకలకు ,నెమ్మదిగా పోవాలని పటేల్ నగర్ బ‌స్తీ యూత్ నాయకుడు శేఖర్ ఆ యువ‌కుల‌ను మంద‌లించాడు. దీంతో వారు అత‌నిపై దాడి చేశారు. అక్క‌డితో ఆగ‌కుండా దాడిని మతపరమైన గోడవలుగా చిత్రీకరించేందుకు య‌త్నిస్తున్నార‌ని బ‌స్తీవాసులు ఆరోపిస్తున్నారు. ఎవరో కావాల్సుకొని బ‌స్తీలో ఇలాంటి అల్లర్లకు పాల్పసుతున్నార‌ని, ప్రభుత్వం వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల‌ని బ‌స్తీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక‌వైపు పోలీసులు, మ‌రోవైపు కర్ఫ్యూ ను కూడా లెక్కచేయకుండా భారీగా యువకులు చేరుకోవ‌డంతో పటేల్ నగర్లో టెంక్షన్లో ఉద్రిక్త‌త వాతావరణం నెల‌కొంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని బ‌స్తీవాసులు బిక్కుబిక్కుమంటూ ఇళ్ల‌లోనే ఉండిపోయారు.

Share post:

Latest