సినీ ఇండస్ట్రీ పై ఇలియానా సంచలన కామెంట్స్..?

సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమందే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఇలియానా ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో ఇలియానా పెద్ద పెద్ద హీరోలతో నటించింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన అందంతో కుర్రకారు మతి పోగొట్టింది. అయితే ఇలియానా తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్లు చేసింది. సినీ పరిశ్రమ చాలా ఘోరమైనది అని చెప్పింది.

సినీ పరిశ్రమలో టాలెంట్ ఎంత ఉన్నా పట్టించుకోరని, ప్రేక్షకులు తమను చూసినంత వరకే తమకు అవకాశాలు వస్తాయని అన్నారు. జనాలు సినిమాలను చూడటం మానేస్తే ఇక తమ పని అయిపోయినట్టేనని, జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవంటూ ఇలియానా సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌ ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అని.. తాను ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తానని ఇలియానా చెప్పింది.