జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు వేయడం ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా వైయస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏపీలో పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యమిస్తూ ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు.

తాజాగా వైఎస్ఆర్ జలకళ పథకంలో ప్రభుత్వం మార్పులు చేసింది. మొన్నటి వరకు కేవలం 5 ఎకరాల పంట పొలం ఉన్న రైతులకు మాత్రమే బోర్లు వేయించేందుకు సిద్ధమైన జగన్ ప్రభుత్వం పది ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులే అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులందరికీ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ సర్కార్ తెలిపింది.