పెళ్లికి రెడీ అయిన ఛార్మీ..వ‌రుడు అత‌డేన‌ట‌?

ఛార్మీ కౌర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీ ప్ర‌స్తుతం ఎలాంటి చిత్రాలు చేయ‌క‌పోయినా నిర్మాతగా మాత్రం దూసుకుపోతోంది. అది కూడా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ నిర్మించే చిత్రాల‌న్నీ ఛార్మీనే నిర్మిస్తోంది. అలాగే పూరీ టూరింగ్‌టాకీస్‌, పూరీ కనెక్ట్స్ ల నిర్వహణ, నిర్మాణ బాధ్యతలన్నీంటిని ఛార్మి చూసుకుంటోంది.

- Advertisement -

ఇదిలా ఉంటే.. ఛార్మీ పెళ్లి వార్త‌లు ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పెళ్లిపై తనకు నమ్మకం లేదనీ, తనకెలాంటి తోడు అవసరం లేదని గతంలోనే కుండబద్దలు కొట్టిన ఛార్మీ.. తాజాగా త‌న మ‌న‌సు మార్చుకుని పెళ్లికి రెడీ అయింద‌ట‌.

దీంతో ఆమె త‌ల్లిదండ్రులు వెంట‌నే త‌మ బంధువుల అబ్బాయినే వ‌రుడుగా ఫిక్స్ చేశార‌ట‌. అత‌డిని పెళ్లి చేసుకునేందుకు ఛార్మీ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని.. త్వ‌ర‌లోనే వివాహం కూడా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే ఛార్మీ స్పందించాల్సిందే.

Share post:

Popular