పెళ్లిపై ఛార్మీ ఘాటు వ్యాఖ్య‌లు..నిరాశ‌లో ఫ్యాన్స్‌!

గ‌త రెండు రోజులుగా ఛార్మీ కౌర్ పెళ్లి వార్త‌లు నెట్టింట్లో జోరుగా హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఛార్మీ పెళ్లి ఫిక్స్ అయింద‌ని.. బంధువుల అబ్బాయినే ఆమె వివాహం చేసుకోబోతోంద‌ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.

- Advertisement -

అయితే తాజాగా పెళ్లి వార్త‌ల‌పై ఛార్మీ ఘాటుగా స్పందించింది. తాను ప్రస్తుతం జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని.. కెరీర్ పరంగా కూడా చాలా మంచి స్థాయిలో ఉన్నానని.. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోవడం లాంటి తప్పుడు నిర్ణయం తీసుకోన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

అయితే ఛార్మీ పెళ్లి చేసుకోన‌ని చెప్ప‌డంతో.. ఆమె అభిమానులు కాస్తంత నిరాశ‌కు గుర‌య్యారు. కాగా, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఛార్మీ.. ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌క‌పోయినా పూరీ టూరింగ్‌టాకీస్‌, పూరీ కనెక్ట్స్ ల నిర్వహణ, నిర్మాణ బాధ్యతలన్నీంటిని చూసుకుంటూ నిర్మాత‌గా దూసుకుపోతోంది.

Share post:

Popular