అత‌డు అడిగితే పెళ్లికి రెడీ అంటున్న చిన్నారి పెళ్లి కూతురు!

అవికా గోర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అవికా.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఇచ్చిన విజ‌యంతో తెలుగులో వ‌రుస అవ‌కాశాలు వరించాయి.

కానీ, క‌థల‌ ఎంపిక స‌రిగ్గా లేక‌పోవ‌డం వల్ల‌.. అవికాకు ఊహించినంత సక్సెస్ రాలేదు. దీంతో అవ‌కాశాలు కూడా త‌గ్గాయి. అయితే ఈ మ‌ధ్య నాజూగ్గా త‌యారైన ఈ బ్యూటీ మ‌ళ్లీ బిజీగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇదిలా ఉంటే.. అవికా హైదరాబాద్‌కు చెందిన మిలింద్‌ చంద్వానీతో ప్రేమలో ఉన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ ఒక ఎన్జీవో కోసం పనిచేసిన క్రమంలో ప్రేమలో పడ్డారు.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది అవికా. ఈ ఇంట‌ర్వ్యూలో పెళ్లి ఎప్పుడని హోస్ట్ ప్ర‌శ్నించ‌గా..ఇప్పుడే నాది పెళ్లి వయసు కాదు. కానీ మిలింద్‌ చేసుకుందామని అడిగితే దానికి నేను రెడీగా ఉన్నాను. తను రేపే పెళ్లి చేసుకుందామన్నా కూడా అందుకు నేను సిద్దమే అని అవికా పేర్కొంది. ఇక అవికా మాట‌లు చూస్తుంటే త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Share post:

Popular