వైరల్ అవుతున్న అల్లు అర్హ క్యూట్ పిక్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉండే ఫ్యాన్స్ వేరు. తను సినిమాల్లోనే ఫ్యామిలీతో చేసే అల్లరిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా అర్షాతో సరదాగా సంభాషిస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ కూతురుకు కూడా ప్రత్యేక ఫ్యాన్ పాలోయింగ్ ఉండేలా చేసుకున్నాడు. ఇకపోతే కొత్త కొత్త ఫోటో షూట్ లతో హీరోయిన్స్ కంటే అందంగా ఉండేలా ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా అర్హకు తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి త‌న కూతురు అర్హ ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఈ క్యూట్ పిక్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. బేబి పింక్ క‌ల‌ర్ స్ట‌ర్క్‌లో అర్హ అమాయ‌క‌పు చూపులు అంద‌రిని క‌ట్టిప‌డేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest