వైర‌ల్ అవుతున్న యూట్యూబ‌ర్ స్టంట్ వీడియో..!‌

ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ మిస్ట‌ర్ బీస్ట్ చేసిన ఓ స్టంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్‌గా మారుతోంది. అతడు ఏకంగా 50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి అయ్యాడు. ఓ శ‌వ‌పేటిక‌లో ఉంచి అతని భూమిలో పాతి పెట్టారు. జిమ్మీ డొనాల్డ్‌స‌న్ అనే ఈ యూట్యూబ‌ర్ త‌న 5.75 కోట్ల మంది సబ్‌స్క్రైబ‌ర్ల‌ను మెప్పించటానికి అప్పుడప్పుడు వింత వింత వీడియోల‌ను చేస్తూ ఉంటాడు. ఏకంగా రెండు రోజుల పాటు స‌జీవంగా త‌న‌ను భూమిలో పాతిపెట్టడం విశేషం. దీనికి సంబంధించిన 12 నిమిషాల వీడియోను త‌న చానెల్‌లో మిస్ట‌ర్ బీస్ట్ పోస్ట్ చేశాడు.

నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో ఏకంగా 5 కోట్ల మంది పైగా చూడటం మరో విశేషం. రెండు రోజుల పాటు అత‌డు ఆ శ‌వ‌పేటిక‌లోనే ఉన్నాడు. అత‌ని క‌ద‌లిక‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రికార్డు చేయ‌డానికి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. బ‌య‌టి నుంచి ఆక్సిజ‌న్‌ను శ‌వ ‌పేటిక‌లోకి పంపడంతో పాటు అవసరమయినప్పుడు చికిత్స అందించ‌డానికి డాక్ట‌ర్‌ను కూడా రెడీగా ఉంచారు.

Share post:

Latest